Saturday, May 17, 2014

C Language In Telugu Part - 2

The Basic Elements To Learn C-Language


 సి క్యారెక్టర్ సెట్ (C Character Set)

ముందుగా మనం సి ప్రోగ్రాం ను వ్రాయడానికి అవసరమైన అక్షరాలను గూర్చి తెలుసుకుందాం.


సి ప్రోగ్రాం ను వ్రాయడానికి అవసరమైన అక్షరాలను, అంకెలను మరియు గుర్తులనే "సి క్యారెక్టర్ సెట్" అని అంటారు.
అవి.
1. ఆల్ఫాబెట్ లు (Alphabets)
ఉదా:-
A to Z
a to z
2. డిజిట్ లు (Digits)
ఉదా:-
0 to 9
3. స్పెశల్ సింబల్ లు (ప్రత్యేక గుర్తులు)(Special symbols)
ఉదా:-
* , / , # , ( , ), {, }, ; మొదలైనవి.
పై వాటిని ఉపయోగించి మనము సి ప్రోగ్రాం ను వ్రాస్తాము.


The C Character Set

The letters, digits and special symbols which are used to write a C-Program are called "C Character Set".
They are.
1.Alphabets
Ex:-
A to Z
a to z

2 Digits
Ex :-
0 to 9
3. Special symbols
ఉదా:-
* , / , # , ( , ), {, }, ; etc...

"కాన్ స్టాం ట్స్" (కలిపి చదవండి) -  వేరియబుల్స్

కాన్ స్టాం ట్స్:-

మనము ఇంతకుముందే కంప్యూటర్ తో చేయించవలసిన పనినే "ప్రోగ్రాం" అంటామని తెలుసకున్నాము. మరి అది ఎలాంటి పని ( ప్రోగ్రాం) ?.  సాధారణంగా మనము చాలావరకు కంప్యూటర్ తో గణిత సంభంద ప్రక్రియలైన కూడికలు, తీసివేతలు , గుణకారాలు మరియు భాగహారాలు మొదలైన పనులను చేయిస్తాము. ఇలాంటి పనులలో మనము అంకెలను లేదా సంఖ్యలను మరియు తార్కిక సంబంద ప్రక్రియలైన "అవును" ( Y - Yes) లేదా "కాదు" (N - No) అని తెలిపే మొదలగు అక్షరాలను ఉపయోగిస్తాము.
అనగా ఒక ప్రోగ్రాం నకు అవసరమైన అంకెలను లేదా సంఖ్యలను లేదా అక్షరాలను మొదలైన వాటినే
"సి -కాన్ స్టాం ట్స్" అని అంటారు.
Ex:-
2, 78, 12.53, Y, N, M (male), F (female) etc...

Note :-

 సి -కాన్ స్టాం ట్స్ ను ముఖ్యంగా 2 రకాలుగా విభజించారు. అవి.
1. ప్రైమరీ కాన్ స్టాం ట్స్
   A. ఇంటిజర్ కాన్ స్టాం ట్స్:- అనగా పూర్ణ సంఖ్యలు (దశాంశ బిందువు లేనివి)
   Ex:- 21, 3, -9, -84 etc...
   B. రియల్ కాన్ స్టాం ట్స్ :- అనగా వాస్తవ సంఖ్యలు (దశాంశ బిందువు కలవి)
   Ex:- 21.34, 3.0, -9.21, -84.56 etc...
   C. క్యారెక్టర్ కాన్ స్టాం ట్స్ :- అనగా 2 సింగల్ ఖోట్స్ మద్యన తెలియపరిచిన ఏదైనా ఒక ఆల్ఫాబెట్ లేదా డిజిట్
        లేదా స్పెషల్ సింబల్.
   Ex:- 'A', 'a', '2', '*', '?' etc...
2. సెకండరీ కాన్ స్టాం ట్స్
   అర్రెస్, స్ట్రక్చర్స్, యూనియన్స్ మరియు ఈనమ్స్ ( వీటి గురించి తరువాత తెలుసుకుందాము)

వేరియబుల్స్ :-
మనము నిజ జీవితంలో ఎన్నో ముఖ్యమైన విషయాలను మన మెదడులో స్టోర్ చేసుకొని అవసరమైనప్పుడు వాటిని తిరిగి ఎలా గుర్తుకు తెచ్చుకుంటా మో  అదే విధంగా కంప్యూటర్ కూడా తనకు అందించిన డేటా ను "రామ్", "హార్డ్ డిస్క్" మొదలైన పరికరాలలో స్టోర్ చేసుకుని తిరిగి మనము అడిగినప్పుడు మనకు చూయిస్తుంది. అదేవిధంగా మనము కంప్యూటర్ తో ఏదైనా ప్రోగ్రాం ను చేయించ దలచుకున్నప్పుడు ఆ ప్రోగ్రాం నకు అవసరమైన విలువలను (వాల్యూస్) అందిచవలసి వుంటుంది. ఇలా అందించబడిన విలువలను కంప్యూటర్ తన "రామ్" అనే పార్ట్ లో ఏదో ఒక ప్రదేశం లో స్టోర్ చేసుకొని వాటిని ఉపయోగించు కుంటుంది. ఇలాంటి ప్రదేశాలను (ప్లేసెస్) ను మనమే ప్రోగ్రాం ద్వారా తాయారు చేసి వాటికి తగిన పేర్లను పెట్ట వలసి వుంటుంది. వీటినే "సి - లాంగ్వేజ్" లో వేరియబుల్స్ అని అంటారు.
Ex:-
A = 10;
B = 20;
C;
పై ఉదాహరణలో A,B,C అనునవి వేరియబుల్స్ మరియు వాటిలో స్టోర్ చేయబడి వున్న 10, 20 అనునవి "కాన్ స్టాం ట్స్ " (కలిపి చదవండి).ఇక్కడ C అనే ప్లేస్ ఖాళీ గా ఉంచబడింది.

ఒక వేరియబుల్ నకు పేరును పెట్టడానికి ఈ క్రింది నియమాలను అనుసరించవలెను 
1. మొదటి అక్షరంగా తప్పనిసరిగా "ఆల్ఫాబెట్" ను ఉపయోగించ వలెను.

Constants - Variables



No comments:

Post a Comment