Sunday, July 4, 2010

Computer Basics In Telugu

కంప్యూటర్ నిర్వచనము :- కంప్యూటర్ అనునది ఒక ఎలక్ట్రానిక్ వస్తువు, అందులో లో మనము సమాచారాన్ని (డేటా ను) పొందుపరచి, దానికి అవసరమైన మార్పులు చేర్పులు (అనగా ప్రాసెస్సింగ్) చేసి, తిరిగి దానిని బయటకు (అవుట్ పుట్ గా) తీసుకోవచ్చు.
నోట్ :-
కంప్యూటర్ లో సమాచారాన్ని "డేటా" అని అంటారు, అది రూపంలో నైనా ఉండవచ్చు అనగా ఆడియో, వీడియో, గ్రాఫిక్స్ (చిత్ర రూప) లేదా టెక్స్ట్ (అక్షర రూపంలో).

కంప్యూటర్ పనిచేయు తీరు :-
డేటా ను అందిచడం --> నిలువ & ప్రాసెస్ (మార్పులు) చేయడం --> బయటకు తీసుకోవడం
ఇంగ్లీష్ లో :-ఇన్ పుట్ డేటా --> సేవ్ & ప్రాసెస్ డేటా --> ఔట్పుట్ డేటా

పై చిత్రం లో కంప్యూటర్ కు సంభందించిన అన్ని వస్తువులు ( Devices - డివైసెస్ ) సి.పి.యు. కు మాత్రమే అటాచ్ చేయబడి వున్నాయి.
వస్తువులను రెండు రకాలుగా వర్గీకరించారు, అవి
1. Input Devices (ఇన్ పుట్ వస్తువులు)
2. Output Devices ( అవుట్ పుట్ వస్తువులు)

1. Input Devices (ఇన్ పుట్ వస్తువులు) :-
వస్తువులు కంప్యూటర్ కు డేటా ను అందిచడానికి ఉపయోగ పడతాయి.
ex:-
కీబోర్డు (Keyboard) :- వస్తువు కంప్యూటర్ కు అక్షరాల రూపం లో వున్నడేటాను (అనగా Alphabets, Digits i.e. 0-9, Special symbols i.e. గుర్తులు) మరియు కంప్యూటర్ చేయ వలసిన పనులను (Instructions - ఇన్స్ట్రక్షన్స్ లను) అందిస్తుంది.

మౌస్ (mouse) :- వస్తువు కంప్యూటర్ లో చిత్రాలను గీయటానికి మరియు కంప్యూటర్ చేయ వలసిన పనులను అందిస్తుంది.

స్కాన్నర్ (Scanner) :- వస్తువును ఉపయోగించి మనము పేపెర్ పై ఉన్న చిత్రాలను మరియు ఫోటోలను కంప్యూటర్ లోనికి తీసుకోవచ్చు. ప్రక్రియ నే (Scanning - స్కాన్నింగ్) అని అంటారు.

మైక్ (Mic) :- వస్తువును ఉపయోగించి మనము మన మాటలను (Voice - వాయిస్ ను) కంప్యూటర్ లో రికార్డు చేసుకోవచ్చు. ( ఉదా. సెల్ ఫోన్ లో ఆడియో రికార్డ్ చేసే విధంగా)

వెబ్ కెమరా (Web camera) :- వస్తువును ఉపయోగించి మనము కంప్యూటర్ లో వీడియో ను రికార్డు చేసుకోవచ్చు. ( ఉదా. సెల్ ఫోన్ లో వీడియో రికార్డ్ చేసే విధంగా)
2. Output Devices (ఆవుట్ పుట్ వస్తువులు) :- వస్తువులు కంప్యూటర్ నుండి డేటా ను తిరిగి మరల పొందటానికి ఉపయోగ పడతాయి.
ఉదా:-
మోనిటర్ లేదా V.D.U. (Visual Display Unit - విస్వల్ డిస్ప్లే యూనిట్) :- ఇది కేవలం డేటా ను చూడటానికి మాత్రమే ఉపయోగ పడుతుంది. ( ఉదా. సెల్ ఫోన్ లో స్క్రీన్ మాదిరిగా పని చేస్తుంది)

ప్రింటర్ (Printer) :- ఇది కంప్యూటర్ లో వున్న డేటా ను పేపర్ లపై ప్రింట్ తీసుకోవటానికి ఉపయోగపడుతుంది.
స్పీకర్స్ (Speakers) :- ఇవి కంప్యూటర్ లో వున్న ఆడియో డేటా ను వినడానికి ఉపయోగ పడతాయి.

సి.పి.యు. (C.P.U. i.e. Central Processing Unit - సెంట్రల్ ప్రాసెస్సింగ్ యూనిట్)
కంప్యూటర్ లో ప్రతి ఇన్ పుట్ మరియు అవుట్ పుట్ వస్తువులు దీనికే కన్నెక్ట్ చేయబడి వుంటాయి.
ఇది మనము (అనగా కంప్యూటర్ ఆపరేటర్)

No comments:

Post a Comment